ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిసారి తెరాస పార్టీయే అధికారంలో ఉండే అవకాశం ఉంది.
ఏ రాజకీయ పార్టీకైనా శాశ్వతంగా తన పార్టీయే అధికారంలో ఉండాలనే కోరిక సర్వసాధారణం , రాజకీయ పార్టీల లక్ష్యం కూడా అలాగే ఉంటుంది , ఆ దిశలో పనిచేస్తూ ఉంటాయి ఇది తప్పు కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు గారు , ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిసారి మీ తెరాస పార్టీయే అధికారంలో ఉండే అవకాశం కచ్చితంగా ఉంది. అంతేకాదు మీరు జాతీయ పార్టీని ఏర్పాటు చేసి దేశానికి మార్గ దర్శకులై స్వయంగా మీరే ప్రధాన మంత్రి అయ్యే అవకాశము కూడా కచ్చితంగా ఉంది. ఇది అసాధ్యం కాదు ఎందుకంటే ఏదైనా విప్లవాత్మక మార్పులు సమాజములో తీసుకు రావాలి అంటే అది అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ద్వారనే మాత్రమే సాధ్యం . అయితే అధికారం సమర్ధత నాయకత్వం మరియు సత్తా ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి , ఏదైనా చేయగలిగే సత్తా ఉందంటే అది కేవలం ఇప్పుడు మీకే మాత్రమే ఉంది . ప్రజల ఆకాంక్ష తీర్చే అధికారం మరియు సాధించే సత్తా మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీకు మీపార్టీకి కావలసిందల్లా ప్రజలకు చిత్తశుద్దితో , నిజాయితీగా , నిస్వార్థంగా , నిజంగా సేవ చేయాలనే సంకల్పం మరియు ఎంతటి కష్టానైన ఎ...